హాయ్ ఫ్రెండ్స్ ..!
నేను నేన్రా.. గుర్తుపట్టలేవ..? అని చెప్పుకునే రోజులేవో మునుముందు రావచ్చేమోనని ముందే గుర్తెరిగి చెప్పుకున్నాం, గుర్తుకొచ్చాయా ఆ మాటలు..? పట్టా పొంది ఉద్యోగ పట్టం కట్టించుకోవలెనన్న పట్టుదలతో ప్రణాళికలు వేస్తు ప్రతిభకై పాగవేసే ఆ పాతరోజుల్లో కుదిరిన మన ప్రథమ పరిచయం ఇంకా నా మనో పలకాల్లో పదిలంగానే వుంది సుమా..! హమ్మయ్యా మొత్తానికి ఆనాటి బాసల ఈ భాషతో నైనా ఈ రోజు ఇల గుర్తుపట్టావని నేను బాగ గుర్తుపెట్టుకుంటానులే. ఒరే.. హితముకొరే స్నేహుతుడా ఉపాది బాటలో ఊరిని వదిలిన మైత్రినెరిగిన మన మిత్రత్వానికి మరుపు రాకూడదనే మన మిత్రులందరితో అప్పుడప్పుదు షేశములవుతున్న విశేషాలేమైన వుంటే వెంటనే నా సొంత బ్లాగు లో తెలియచేస్తున్న. సొ నీవు ఆ బ్లాగునొకసారి చూడుమరి. ఔన్రోయ్ .. నీకోవిషయం చెప్పలిక్కడ. వాణిజ్య ప్రకటనలు వ్రాసే నాకు ఈ సంవత్సరం లో సినిమా పాటలు వ్రాసే అవకాశం వచిందిరా.. హింది చిత్రరంగం లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గారైన రాం లక్ష్మన్ గారి తో పనిచేశాను. కానీ అచీవ్మెంటు చిన్నదేరా.. ఎందుకంటే ఆ సినిమాని మహారాష్త్ర లో గల తెలుగు వారికోసం ఎక్కడే విడుదల చెశారు. అందుకె అచీవ్మెంటు చిన్నదన్ననులె. పాటలన్ని నేనె వ్రాశా విన్నవారినుండి అబ్బ చాల భాగావ్రాశారండి చక్కటి ప్రాసా ఇంకా ప్రతిపాటలోను సందర్భోచిత సందేశం పెట్టారు అంటూ ఈ-మెయిల్స్, ఫోన్లు వస్తున్నాయి. పోతే పోనిలే ఓ కాలు అనుకుని నీకు కాలు చెసి ఈ ఆనందాన్ని నీతో పంచుకుందామంటే నీ నంబర్ నాదగ్గర లేదు. నీవేమో సప్తసముద్రాలు దాటి పాతాలం లో ( ఫురానగాథల్లో అమెరికా ను పాథాలంగ పేర్కొనబడింది)నీకు పొద్దుపొడిస్తే నన్ను చీకటి అలుముకుంటది నీకు చీకటి పడితే నాకు దినకరుని దర్శనం. అలా వీలుకాక ఈ లేఖ పెట్టానుర కాకా (బాబయ్)నీ ఈ-మెయిల్ ఐ డి ఇవ్వు... ఈ మెయిల్లో నేను వ్రాసిన సినిమా పాటలు పంపుతాను. ఇంకా మన స్నేహితులందరికి కూడా నా తో టచ్ లో వుండమని చెప్పు. మరి ఉంటాన్రా..బాయ్ .!
Monday, November 24, 2008
Subscribe to:
Posts (Atom)