Monday, November 24, 2008
ఒరే మిత్రమా
నేను నేన్రా.. గుర్తుపట్టలేవ..? అని చెప్పుకునే రోజులేవో మునుముందు రావచ్చేమోనని ముందే గుర్తెరిగి చెప్పుకున్నాం, గుర్తుకొచ్చాయా ఆ మాటలు..? పట్టా పొంది ఉద్యోగ పట్టం కట్టించుకోవలెనన్న పట్టుదలతో ప్రణాళికలు వేస్తు ప్రతిభకై పాగవేసే ఆ పాతరోజుల్లో కుదిరిన మన ప్రథమ పరిచయం ఇంకా నా మనో పలకాల్లో పదిలంగానే వుంది సుమా..! హమ్మయ్యా మొత్తానికి ఆనాటి బాసల ఈ భాషతో నైనా ఈ రోజు ఇల గుర్తుపట్టావని నేను బాగ గుర్తుపెట్టుకుంటానులే. ఒరే.. హితముకొరే స్నేహుతుడా ఉపాది బాటలో ఊరిని వదిలిన మైత్రినెరిగిన మన మిత్రత్వానికి మరుపు రాకూడదనే మన మిత్రులందరితో అప్పుడప్పుదు షేశములవుతున్న విశేషాలేమైన వుంటే వెంటనే నా సొంత బ్లాగు లో తెలియచేస్తున్న. సొ నీవు ఆ బ్లాగునొకసారి చూడుమరి. ఔన్రోయ్ .. నీకోవిషయం చెప్పలిక్కడ. వాణిజ్య ప్రకటనలు వ్రాసే నాకు ఈ సంవత్సరం లో సినిమా పాటలు వ్రాసే అవకాశం వచిందిరా.. హింది చిత్రరంగం లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గారైన రాం లక్ష్మన్ గారి తో పనిచేశాను. కానీ అచీవ్మెంటు చిన్నదేరా.. ఎందుకంటే ఆ సినిమాని మహారాష్త్ర లో గల తెలుగు వారికోసం ఎక్కడే విడుదల చెశారు. అందుకె అచీవ్మెంటు చిన్నదన్ననులె. పాటలన్ని నేనె వ్రాశా విన్నవారినుండి అబ్బ చాల భాగావ్రాశారండి చక్కటి ప్రాసా ఇంకా ప్రతిపాటలోను సందర్భోచిత సందేశం పెట్టారు అంటూ ఈ-మెయిల్స్, ఫోన్లు వస్తున్నాయి. పోతే పోనిలే ఓ కాలు అనుకుని నీకు కాలు చెసి ఈ ఆనందాన్ని నీతో పంచుకుందామంటే నీ నంబర్ నాదగ్గర లేదు. నీవేమో సప్తసముద్రాలు దాటి పాతాలం లో ( ఫురానగాథల్లో అమెరికా ను పాథాలంగ పేర్కొనబడింది)నీకు పొద్దుపొడిస్తే నన్ను చీకటి అలుముకుంటది నీకు చీకటి పడితే నాకు దినకరుని దర్శనం. అలా వీలుకాక ఈ లేఖ పెట్టానుర కాకా (బాబయ్)నీ ఈ-మెయిల్ ఐ డి ఇవ్వు... ఈ మెయిల్లో నేను వ్రాసిన సినిమా పాటలు పంపుతాను. ఇంకా మన స్నేహితులందరికి కూడా నా తో టచ్ లో వుండమని చెప్పు. మరి ఉంటాన్రా..బాయ్ .!
Saturday, August 9, 2008
తృప్తి
తృప్తి
జీవిస్తున్న ప్రతి మనిషి పేద, ధనిక,జ్ఞాని అజ్ఞాని, అంటూ తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ కోరుకునేది తృప్తియే.అందరు పడే యాతన ఆ తృప్తి కొరకే, ఉదయం మేల్కొన్నది మొదలు, యోగి తనకు తెలిసిన జ్ఞాన సాగరంలో తృప్తిని వెతికే సాధనలో నిమగ్నమైపోతాడు. గృహస్థుడైనవారు తన ఇంటిని తన ఇష్టాలకనుగుణంగా మార్చుకొని తృప్తిని వెతికే ప్రయత్నంలో పడివుంటాడు.ప్రతి మనిషి తెలిసియో తెలియకో మొత్తానికి తనుకోరుకున్నదానిని పొంది తృప్తిని అనుభవించాలనుకుంటాడు. ఎందరో ఎన్నో విధాలుగా ప్రత్నిస్తుంన్నా గడ్డాలు పెరిగిపోతూ శరీరము ముడతలు పడుతున్నా సైతం అయ్యా మీరు తృప్తి పొందారా..? అంటె పెదవి విరయడంకంటే పెక్కు సమాధానమేమివండదు.
ఇంతకి తృప్తిని పొందాలనే ఆ అసంతృప్తికి గురిచేసే ఆ తృప్తి ఏమిటో తెలియకండానే, ఇతరలులను తృప్తిపరిచేందుకు మనం తృప్తి పదేండుకు ప్రయత్నిస్తూవున్నాం. ఈ విషయంలో ప్రయత్నాలు ఉన్నాయెగాని, ఫలిథలులేవు. కానీ కాలమంతా తృప్తిపరిచె తృప్తిపడే ప్రయత్నం లోనే కాలమంత కరిగిపోతూంది. ఇతరులకు మనమేదొ చేయడంవల్లో లేదా ఇతరులు మనకేదో చేసిపెట్టడంవల్లో ఇంకేదైన రావచ్చేమోకానీ తృప్తిమాత్రం రాదు అసంతృప్తిపోదు. ఇతరులు మనల్ని మెచ్చుకోవాలి మనవిషయంలో వారు తృప్తిపడాలి అనే కోణంలోనే మనం ప్రవర్థిస్తాం.వేష భాషలు మొదలుకుని ఆహార విహారాదులు చివరికి ఆలొచనా సరళిని కూడా ఆ కోణంలోనే సాగిస్తుంటాము. అయినా అందరి ఆలోచనలు అభిరుచులు ఒకవిధంగా లేవు. - సశేషం (ఇంకావుంది)
Saturday, August 2, 2008
Meetho voka chinnamata
thelugulo ala prayathnichanu
చదువు చదువురా... అంటూ చదువరులను చేసేందుకు చంకన చాకిరిమోత తో బడికి పంపించేసి బాధ్యతా తీర్చుకుంటారు కొందరు తల్లిదండ్రులు ప్రస్తుత కాలములో బల్లు బల్లూకములవలె భవిత పీరు చెప్పి బంధించేసి బ్రతుకునిస్తున్నాయే గానీ బ్రతకనీయడం లేవు పువ్వుపుట్టి పరిమళించే నాటి రోజులు పోయి ఇలా ఈ పట్టాల పైనే పరిమళించాలని పట్టు పట్టుకునే ప్రత్యామ్నాయ రోజులను పుట్టిస్తున్నారు ప్రస్తుత తల్లిదండ్రులు. తత్ఫలితంగా ప్రావిణ్యమొన్దిన పనివాల్లవుతున్నారు. ప్రతిభతో యంత్రాలలో మంత్రముగ్దులవుతున్నారు.ఆక్కున్తున్నారు పనిచేసే మనిషొక యంత్రాలు పుట్టిన్స్తుంటే ఉన్నతమైన మానవత్వపు ఉనికి ఎక్కడుందని వెతుక్కోవాలో ? నాటి తల్లిదండ్రులు నాకేం కావాలో అలా బ్రతుకులో ఇచ్చారు నేటి తల్లిదండ్రులు భవిత త్రాసుకి బ్రతుకుని బంధించేసి వారేం కాలేరో వారికేమి కావలో లాక్కుంటున్నారు. పిల్లలేమో భాషని బంధాన్ని మమ్మీ (పీనుగా)చేస్తున్నారు . పనిలో ప్రతిభ కనబరుస్తూ కోట్ల కొండలు కడుతున్నారు, కానీ గుండెల్లో గుప్పెడు మనుసు కరువైంది. ఎటు చూసిన పనోళే మనుసుకు హాయి గొలిపే పలుకే కరువైంది మనోపలకాల్లో. మనిషి మనులకోసమే మాట్లాడే మనీ లోకం అయిపోతుంది. అందుకే నేను వ్యాపార మాటలు మాట్లాడ దలుచుకోలేదు.మనుసును ఆహ్లాదపరిచే మాటలమూటలు విప్పాలనుకుని ఈ బ్లాగును ప్రారంభించ బోతున్నాను.మీ మనసుకు నచ్చేవిందంగా, హాస్యపు జల్లులు, చిన్న కథలు . విదేశాలకు ఎగిరిపోవడంతో వొంటరులైన అమ్మతో నాన్నగారితో తాతయ్యల్లతో నాన్నమ్మలతో భామ్మలను మాట్లాడించడం తో పాటు ఆధ్యాత్మిక కథలు కథనాలు తో కబుర్లాడుతూ నా తోటి అల్లరల్లరిగా మాటలు ముచ్చటిస్తూ మైత్రితో మి మిత్రత్వాన్ని అందుకోవాలనే ఈ బ్లాగును సృష్టిస్తున్నాను మరైతే నా కోసం దయచేసి చిన్న పని చేయరా..! ఏమంటే ఇందులో ఏ అంశమైన మీకు ఎలా అనిపించిది ఎలా వుంటే బాగుండేది ఎంతగా నచ్చింది ఎందుకు నచలీడు వంటి అభిప్రాయాలూ నాకు ఈ మెయిల్ ద్వారా తెలియచేస్తే చాలు మరో అంశాన్ని మిమ్మల్ని మెప్పించేలా వుండేందుకు ప్రయతిన్స్తాను ఇందులో బోలెడన్ని ఆడియో హాస్యపు జల్లులు మీకోసమే వుంచబోతునన్ను మరి.వుంటాను. నమస్కారం.
మీ
ముముక్షువు